కర్నూలు నగరంలో వీధి కుక్కల నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్న నగర మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు శనివారం తెలిపారు. ఇప్పటివరకు 743 కుక్కలకు శస్త్రచికిత్సలు చేశామన్నారు. ప్రస్తుతం రోజుకు 12 కుక్కలకు మాత్రమే చికిత్స సాధ్యమవుతుండగా, ఈ నెలాఖరున గార్గేయపురం డంప్ యార్డులో రెండో కేంద్రం పనులు పూర్తి కానున్నాయన్నారు. దీంతో మొత్తం 32 శునకాలకు శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.