ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని, జూలై 9న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని శుక్రవారం కర్నూలులో ఆటో కార్మికులను ఆహ్వానిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సూర్జిత్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, రవాణా కార్యాలయాలు, ఏటిసి సెంటర్లను కార్పొరేట్లకు అప్పగించవద్దని నాయకులు విజయ రామాంజనేయులు, నాగరాజు, మహమూద్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.