కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు రాముడు, సాయిబాబా డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో మార్కెట్ యార్డు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జులై 9న సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.