రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కర్నూలులో ట్రాన్స్ జెండర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. అర్హులైన వారందరికీ పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డులు మంజూరు చేయాలని, నైపుణ్యం ఉన్నవారికి సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ఎల్డీఎంను ఆదేశించారు.