సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన లేకుండా లోకేష్ రెడ్ బుక్ అమలుకు వచ్చిందని, అన్యాయ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. హత్యలపై హోం మంత్రి నిశ్శబ్దమని, సూపర్ 6 హామీలు మర్చిపోగా, రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.