ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు ఇంటి వద్ద నుంచే ఉపయోగించుకోవచ్చని కర్నూలు కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9555230009 నంబరుకు 'హాయ్' అని వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే ప్రభుత్వ సేవలు సులభంగా లభిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా ప్రజలు వారికి అవసరమైన సేవలను ఇంటి నుంచి పొందవచ్చన్నారు.