రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపులపై వర్తింపజేస్తున్న రాయితీలను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నగరపాలక కమిషనర్ యస్. రవీంద్రబాబు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆస్తి పన్ను బకాయిదారుల వడ్డీపై 50% రాయితీ, ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులపై 5% పన్ను రాయితీని ప్రభుత్వం కల్పిస్తుందని, వీటికి గడువు ఏప్రిల్ 30 వరకు మాత్రమేనని వెల్లడించారు.