ఉమ్మడి కర్నూలు జిల్లా లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయుల సంఘం జిల్లా ఇన్‌చార్జ్ కొండా లోకేష్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగ మొదటి సంతకం డీఎస్సీ పైన చేయడం అందరికీ తెలిసినది. ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు కూడా అందులో కలిపి డీఎస్సీ ఇవ్వాలని కోరారు. మంగళవారం 2260 ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను నింపాలని ఉత్తర్వులు జారీ చేశారు.