కర్నూలు: వక్ఫ్ చట్ట సవరణను తక్షణమే రద్దు చేయాలి

59చూసినవారు
వక్ఫ్ చట్ట సవరణను తక్షణమే రద్దు చేయాలని సేవ్ వక్ఫ్ జేఏసీ నాయకులు అబ్దుల్ దేశాయ్, హమీద్ లు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులో కార్నర్ మీటింగ్‌లో సిపిఎం, ముస్లిం ఫెడరేషన్, జమాతే ఇస్లామీ నేతలు హాజరై, మాట్లాడారు. కేంద్రం వక్ఫ్ ఆస్తులపై హక్కును బలవంతంగా కబ్జా చేయాలని ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు. చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్