కర్నూలు: 'సమానత్వానికి పూలే కృషి వెలకట్టలేనిది'

సామాజిక సమానత్వానికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు వెలకట్టలేనివిగా వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, విద్యాభివృది కోసం పూలే కృషి చేశారని అన్నారు.