రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.