రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం తల్లి ప్రేమ చూపకపోవడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. బుధవారం సీపీఐ కర్నూలు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ సాగు, త్రాగునీటి కోసం ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, గోదావరి-బానకచర్ల ప్రాజెక్టులు ప్రభుత్వాలకు ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు. సబ్సిడీతో విత్తనాలు తక్షణమే అందజేయాలన్నారు.