కర్నూలు నగరంలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గంటన్నర వ్యవధిలో తాలుకా, త్రీటౌన్, నాలుగో పట్టణ స్టేషన్ పరిధుల్లో ముగ్గురు మహిళల మెడల నుంచి సుమారు 9 తులాల బంగారు గొలుసులు అపహరించారు. పుల్లయ్య కాలేజీ వద్ద ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి, వెంకటాద్రినగర్‌లో యశోద, సంతోష్‌నగర్‌లో భాగ్యలక్ష్మి చైన్‌స్నాచింగ్‌కు గురయ్యారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.