ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరఫున దేశ రక్షణలో పోరాడిన సైనికులకు సంఘీభావంగా తిరంగ ర్యాలీ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కంతోట రామక్రిష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 16న ఉదయం 10 గంటలకు కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ జరుగుతుంది. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.