తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టీటీడీ బోర్డు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.