కర్నూలు మహిళా ప్రాంగణంలో ఏపీఎస్డీసీ సౌజన్యంతో ఉచిత డే స్కాలర్, రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయని నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18-35 మధ్య వయస్సు గల కర్నూలు, నంద్యాల మహిళలకు టైలరింగ్, డేటా ఎంట్రీ, బ్యూటీ థెరపీ, జీడీఏ శిక్షణలు ఇస్తామని. 10వ తరగతి పాస్/ఫెయిల్, ఆధార్, ఫోటోలు, బయోడేటాతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.