కర్నూలు జిల్లాకు ప్రభుత్వం ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ ను కేటాయించింది. గత నెల 17వ తేదీన ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసి 31వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. కర్నూలు నగరంలో ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు గురువారం ఇద్దరు వ్యాపారులు ముందుకు వచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన కమిటీ పూర్వాపరాలు పరిశీలించి ప్రభుత్వ అనుమతితో లైసెన్స్ కేటాయించాల్సి ఉంది.