స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిదని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జనవరి 11న అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.