బాల్య వివాహ విముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో బాల్య వివాహ విముక్త భారత్ కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. 18 ఏళ్ళలోపు అమ్మాయిలకు, 21 ఏళ్ల అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్టవిరుద్దమన్నారు. జేసీ బి. నవ్య, ఐసీడీఎస్ పీడీ వెంకటలక్ష్మి, డీసీపీవో పాల్గొన్నారు.