కర్నూలు: సుపరిపాలనలో ఇంటింటికీ సంక్షేమం చేరింది: మంత్రి టీజీ

52చూసినవారు
కర్నూలు: సుపరిపాలనలో ఇంటింటికీ సంక్షేమం చేరింది: మంత్రి టీజీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం అశోక్‌నగర్‌ 45వ వార్డు ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాద నివారణకు ప్రహరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా చైర్మన్‌ వెంకటేశ్వర్లు, ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్