కర్నూలులో శుక్రవారం జరిగిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని సీఎం ఎక్కడ నెరవేర్చారంటూ ప్రశ్నించారు. యోగాంధ్ర కాదు, ఉద్యోగ ఆంధ్ర కావాలని అన్నారు. నిరుద్యోగులకు భృతిని అందించాలని డిమాండ్ చేశారు.