కర్నూలు: నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
కర్నూలు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో వారు మాట్లాడుతూ వైన్ షాపులు సమయపాలన పాటించకుండా ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి, వయస్సు పరిగణన లేకుండా చిన్నపిల్లలకి కూడా వైన్ విక్రయిస్తున్నాయని ఆరోపించారు. చర్యలు తీసుకోకపోతే, ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్