నిర్లక్ష్యంగా వ్యాన్ నడిపి బైక్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. మంగళవారం నెహ్రూనగర్‌కు చెందిన సిరిగిరి రమణమ్మ (57) కర్నూలు టెలికాం నగర్‌లో ఉన్న కుమారుడి వద్ద ఉంటూ, కుమారుడితో కలిసి నందికొట్కూరుకు బయలుదేరారు. నందికొట్కూర్ రోడ్డు వైపు వెళ్తున్న వీరి బైక్‌ను కర్నూలు టౌన్‌లోకి వస్తున్న అనుమిల్క్ డైరీకి చెందిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణమ్మ కిందపడి మృతి చెందారని సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.