కర్నూలు: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని వైసీపీ డిమాండ్

82చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్