మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజా శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో ఆమె మాట్లాడారు. తిరుమలలో భక్తుల రద్దీ వల్ల జరిగిన హఠాత్ పరిణామం మీద వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు. బాబాయి గొడ్డలి పోటు, కోడి కత్తి, గులకరాళ్ల ఘటనలు ఎలా జరిగిందీ ప్రజలందరికీ తెలుసునన్నారు.