కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 14న యోగా ప్రదర్శనలు

64చూసినవారు
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 14న యోగా ప్రదర్శనలు
యోగాంధ్ర కార్యక్రమం భాగంగా జూన్ 14న జిల్లాలో 6, 149 వేదికలపై యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూలులో యోగాంధ్ర నిర్వహణపై నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్