పిచ్చికుక్క స్వైరవిహారం 40 మందికి గాయాలు

72చూసినవారు
కర్నూలు పలు వీధుల్లో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి 40 మందిపై దాడి తీవ్రంగా గాయపరిచింది. ఎక్కువగా చిన్నారులు గాయపడ్డారు. కర్నూలులో పలు ప్రాంతాల్లో కుక్క స్వైర విహారం చేసి, కనిపించిన పిల్లలను కనిపించినట్లు కొరికడంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగానికి తీసుకొచ్చారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రికి చేరుకుని పరామర్శించి, రూ. 10 వేలు సాయం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్