ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి, బిసి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు రచించిన "దార్శనికుడు మహాత్మా పూలే" పుస్తకాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా బుధవారం ఆవిష్కరించారు. పుస్తక రచయిత ఆనంద్ బాబును కలెక్టర్ అభినందించారు. ఆనంద్ బాబు మాట్లాడుతూ. పూలే ఆశయాలను, ఆలోచనలను పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.