ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నీతి ఆయోగ్ సీవోఓ బీవీఆర్ సుబ్రమణ్యంను కలిశారు. శుక్రవారం ఉత్సాధక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి, విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై వివరంగా మాట్లాడినట్లు మంత్రి భరత్ ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చ ఎంతో ప్రభావం చూపించిందన్నారు.