కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ చేపట్టారు. మొదటిరోజు 99. 05 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మంత్రి టీజీ భరత్ ప్రకాశ్ నగర్ లో 125వ సచివాలయం పరిధిలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.