జెన్నిఫర్ లార్సను కలిసిన మంత్రి టీజీ భరత్

52చూసినవారు
జెన్నిఫర్ లార్సను కలిసిన మంత్రి టీజీ భరత్
ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను కోరినట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో జెన్నిఫర్ లార్సన్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్