నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గురువారం ఎస్ఏఎస్ఏ కోఆర్డినేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. సమాజంలో ప్రస్తుతం ప్లాస్టిక్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు.