నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా నియంత్రించుటకు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంతరణ విజిబుల్ పోలిసింగ్ బుధవారం నంద్యాలలో నిర్వహించారు. నాటు సారా, అక్రమ మద్యం విక్రయదారులపై 03 కేసులు నమోదు చేసి 30 లీటర్ల నాటు సారాయిని 39 క్వాటర్ బాటిళ్ళను స్వాదినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.