కర్నూలు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బి. నవ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా జేసీ నవ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న ఆమెను ఇటీవల కర్నూలు జేసీగా ప్రభుత్వం నియమించింది.