ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడారు. కర్నూలులో 99, నంద్యాలలో 105 మద్యం దుకాణాలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని, ఈనెల 9 వరకు స్వీకరిస్తామని తెలిపారు. 11న కర్నూలు జిల్లాకు జిల్లా పరిషత్ లో, నంద్యాల కలెక్టరేట్‌లో డిప్ తీస్తామని వెల్లడించారు. రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.