ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత భాషా విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడులోని డైట్ కళాశాలలో స్వచ్ఛతా హిసేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత బాషా, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎంపీ నాగరాజు హాజరై మొక్కలు నాటి, మాట్లాడారు. మొక్కలు నాటి పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.