కర్నూలు మండలం గొందిపర్ల పంచాయతీ పరిధిలోని అల్కాలీస్ పరిశ్రమలో ఏకపక్షంగా జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ వ దేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులో మాట్లాడుతూ అభిప్రాయం తెలిపేందుకు వచ్చిన ప్రజా సంఘాల నేతలపై దాడులుచేసిన దుండగులపై కేసులు నమోదు చేయాలని, పోలీసులు చూస్తూ ఉండటంపై చర్యలు తీసుకోవాలని, స్వేచ్ఛ వాతావరణం కల్పించకపోవడం తప్పని విమర్శించారు.