కర్నూలు మార్కెట్ కు పోటెత్తిన ఉల్లి.. గరిష్ట ధర రూ. 3, 769

70చూసినవారు
కర్నూలు మార్కెట్ కు పోటెత్తిన ఉల్లి.. గరిష్ట ధర రూ. 3, 769
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లి పోటెత్తుతోంది. ధరలు తగ్గుతాయనే భయంతో రైతులు హడావుడిగా ఉల్లిగడ్డలు కోసి తెస్తున్నారు. మంగళవారం 362 మంది రైతులు 11, 502 క్వింటాళ్లు తెచ్చారు. ఉల్లి గరిష్ట ధర స్వల్పంగా పెరిగినప్పటికి సగటు ధర పడిపోయింది. సగటు ధరను బట్టి చూస్తే వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. క్వింటాలుకు కనిష్టంగా రూ. 319, గరిష్టంగా రూ. 3,769 లభించింది. సగటు ధర రూ. 2,067 మాత్రమే నమోదైంది.

సంబంధిత పోస్ట్