కర్నూలు జిల్లాలో పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ నుంచి బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి అభివాదం తెలిపారు.