కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ఐద్వా కర్నూలు నగర కార్యదర్శి ధనలక్ష్మి, దానమ్మ డిమాండ్ చేశారు. శనివారం వారు కల్లూరు ముజఫర్ నగర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సభ్యత్వం చేర్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై విమర్శలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి వాగ్దానాలు నెరవేర్చాలని వారు తెలిపారు.