రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 20 నుంచి 29 వరకు పీజీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 55 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి వర్సిటీలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.