రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు ప్రజావేదికలు నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఈ అంశంపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి కరపత్రాల్లోని విషయాలను వివరించాలన్నారు.