కర్నూలు మండల పరిషత్ ఆఫీసులో శనివారం నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మహిళా ఎంపీపీ వెంకటేశ్వరమ్మపై టీడీపీ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు చేసుకునేందుకు మండల అభివృద్ధి నిధులు రూ. 2 కోట్లను ఒక ఎంపీటీసీ సభ్యునికి రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తామని సమావేశంలో ఎంపీపీ ప్రకటించగానే టీడీపీ ఎంపీటీసీ సభ్యులు రచ్చరచ్చ చేశారు.