ఎర్రమఠం ప్రభుత్వ పాఠశాలకు భోజన ప్లేట్లు అందజేసిన రోటరి క్లబ్

12చూసినవారు
ఎర్రమఠం ప్రభుత్వ పాఠశాలకు భోజన ప్లేట్లు అందజేసిన రోటరి క్లబ్
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్ర మఠం ప్రభుత్వ పాఠశాలకు ఆదివారం రోటరీ క్లబ్ సభ్యులు భోజన ప్లేట్లను అందజేశారు. క్లబ్ మాజీ అధ్యక్షులు డివి సుబ్బయ్య సహకారంతో పేద విద్యార్థుల సౌకర్యార్థం స్టీల్ ప్లేట్లు అందజేయడం జరిగిందని రోటరీ క్లబ్ మిడ్ టౌన్ అధ్యక్షులు కేశవ్ కేశవమూర్తి తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివయ్య, శ్రీనివాస్ రెడ్డి చింతల మోహన్రావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్