ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు శనివారం కర్నూలు రెండవ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా కర్నూలు రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం నాగరాజు డిపో ఆవరణలో మొక్కను నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, సూపర్వైజర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.