భారతీయ సంస్కృతికి ప్రతిబింబం సనాతన ధర్మమని జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో భరతమాత ఆలయంలో దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి. బి. వి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.