కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. శనివారం కర్నూలులో నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్, సాయి ఉదయ్ ప్రైవేటు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాంల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నా డీఈఓ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫీజు రెగ్యులేషన్ కమిటీని పటిష్ఠం చేయాలన్నారు.