గార్గేయపురంలో సీబీజీ ప్లాంట్‌కు స్థల పరిశీలన

83చూసినవారు
గార్గేయపురంలో సీబీజీ ప్లాంట్‌కు స్థల పరిశీలన
కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం డంప్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న కంప్రెస్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ స్థలాన్ని కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు శుక్రవారం పరిశీలించి, ఆయన మాట్లాడారు. నగరంలో ప్రతి ఏటా టన్నుల కొద్ది వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండటంతో భూమి కలుషితమై పోతుందన్నారు. దానికి పరిష్కారంగా చెత్త నుంచి బయోగ్యాస్‌ తయారు చేసే సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్