కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం కర్నూలు 40వ వార్డులో కార్పొరేటర్ విక్రమ సింహారెడ్డితో కలిసి పర్యటించారు. ప్రజలు, కార్పొరేటర్ తెలియజేసిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తుంగభద్ర నది తీరాన పర్యటించి ఎస్టీపీకి అనువైన ప్రదేశాలను పరిశీలించారు.