ఈ నెల 2,3తేదీల్లో కర్నూలులోని స్థానిక ఆదర్శ విద్యా మందిర్ జూనియర్ కళాశాల మైదానంలో.. ఎస్జిఎఫ్ అండర్- 19 రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ సి. హర్షవర్ధన్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆదర్శ విద్యా మందిర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ బి. హరికిషన్ పాల్గొని, స్పోర్ట్స్ కిట్టును క్రీడాకారులకు అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.